ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోదకుల ఆకలి తీరుస్తున్న చింతమనేని దంపతులు - చింతమనేని ప్రభాకర్ వార్తలు

లాక్​డౌన్​ నేపథ్యంలో అన్ని చోట్ల హోటళ్లను మూసివేశారు. దీనివల్ల నిత్యావసరాలు, అత్యవసర సరకులు తీసుకువెళుతున్న వాహన చోదకులకు ఎక్కడా భోజనం దొరకడం లేదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారి వెంట ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు తెదేపా నేత చింతమనేని ప్రభాకర్.

chintamaneni prabhakar
chintamaneni prabhakar

By

Published : Apr 9, 2020, 3:40 PM IST

చోదకుల ఆకలి తీరుస్తున్న చింతమనేని దంపతులు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహన చోదకులకు ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు. లాక్​డౌన్​తో హోటళ్లను మూసేయటంతో అత్యవసర సరకులు తీసుకువెళుతున్న వాహన చోదకులకు ఎక్కడా అల్పాహారం లభించని పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు అనుగుణంగా చోదకులకు అల్పాహారం అందిస్తున్నారు చింతమనేని. దుగ్గిరాల సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చేవారు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే అల్పాహారం కోసం వచ్చేవారు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి వెంకట రాధారాణితో కలిసి వాహన చోదకులకు అల్పాహారం వడ్డిస్తున్నారు చింతమనేని ప్రభాకర్. లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఉదయం వారికి అల్పాహారం అందిస్తామని తెలిపారు. అలాగే కలెక్టర్ అనుమతిస్తే సాయంత్రం కూడా అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details