ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేని ప్రభాకర్​కు బెయిల్ మంజూరు - చింతమనేని ప్రభాకర్​కు బెయిల్ వార్తలు

తెదేపా నేత చింతమనేని ప్రభాకర్​కు బెయిల్ వచ్చింది. ఆయనకు, ఆయన అనుచరులకు ఏలూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

chintamaneni prabhakar
chintamaneni prabhakar

By

Published : Jun 15, 2020, 4:28 PM IST

అచ్చెన్న అరెస్టుకు నిరసనగా ధర్నాకు ప్రయత్నించి అరెస్టయిన తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​కు బెయిల్ లభించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ప్రభాకర్‌ను ఏలూరు గ్రామీణ పోలీసులు ఈ నెల 12న అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు చింతమనేనిని, ఆయన అనుచరులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ ఏలూరు ఎక్సైజ్‌ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

ABOUT THE AUTHOR

...view details