'కోడ్ అమల్లో ఉండగా.. వాలంటీర్లతో సమావేశమా?' - ఎమ్మెల్యే ఎలిజా తాజా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో.. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా.. గ్రామ వాలంటీర్లతో సమీక్ష చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి కళ్లు, చెవులు, నోరులా పని చేయాలని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాలు వైకాపా కైవసం చేసుకునేలా ఫలితాలు సాధించాలని.. సీఎంకు కానుక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. కానీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి సమావేశం.. నిబంధనలకు విరుద్ధమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.