ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో అధిక ఆశ్వయిజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ప్రధాన ఘట్టమైన స్వామి తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఏకాంతంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో ఆలయ అర్చకులు, సిబ్బంది మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధాన ఆలయ గర్భాలయంలో రజత సింహాసనంపై స్వామి అమ్మవార్లను కల్యాణమూర్తులుగా కొలువుదీర్చి పుష్పాలంకరణ చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ హారతులు పట్టి కల్యాణ వేడుక జరిపారు.
ద్వారకాతిరుమలలో ఘనంగా చిన వెంకన్న కల్యాణం - venkateswara swamy temple at west godavari district news
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో వైభవంగా నిర్వహించారు. అధిక ఆశ్వయిజ మాస తిరు కల్యాణ మహోత్సవాలను కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరిపారు.
ద్వారకాతిరుమలలో ఘనంగా చిన వెంకన్నను కల్యాణం
TAGGED:
ద్వారకాతిరుమల తాజా వార్తలు