ETV Bharat / state
అంతర్వేది కల్యాణోత్సవాలు భళా - antahrvedi
వైభవోపేతంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవాలకు హోంమంత్రి చినరాజప్ప హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అంతర్వేది కల్యాణోత్సవాలు
By
Published : Feb 16, 2019, 6:12 AM IST
| Updated : Feb 16, 2019, 10:31 AM IST
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 11.47 గంటలకు స్వామివారి కల్యాణం జరిగింది. ఈ ఉత్సవాలకు హోంమంత్రి చినరాజప్ప హాజరై..సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. Last Updated : Feb 16, 2019, 10:31 AM IST