ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Children Rally: నరసాపురం జిల్లా కేంద్రం కోసం చిన్నారుల ర్యాలీ - నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చిన్నారుల ర్యాలీ

Children rally: తమ భవిష్యత్తు బాగుపడాలంటే నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ.. చిన్నారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గత 57 రోజులుగా ఇదే విషయమై జేఏసీ ఆధ్వర్యంలో.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిరసనలు, రిలే దీక్షలు చేస్తున్నారు. దీనికి మద్దతుగా పట్టణంలోని చిన్నారులు ర్యాలీ చేపట్టారు.

children under five years held rally in narsapuram
నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చిన్నారుల ర్యాలీ

By

Published : Mar 30, 2022, 7:48 AM IST

Updated : Mar 30, 2022, 8:14 AM IST

నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చిన్నారుల ర్యాలీ

Children rally: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని గత 57 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిరసనలు, రిలే దీక్షలు చేస్తున్నారు. దీనికి మద్దతుగా పట్టణంలోని చిన్నారులు నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చిన్నారులు జిల్లా కేంద్రం కోసం ర్యాలీ నిర్వహించారని.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. తమ భవిష్యత్​ కోసం నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని.. తమ తల్లిదండ్రులు ఓట్లు వేసి గెలిపించిన నాయకులను నిలదీసేందుకు... తాము సైతం అంటూ చిన్నారులు రోడ్డు ఎక్కారన్నారు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే స్పందించి జిల్లా కేంద్రం కోసం పోరాడాలని.. లేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Last Updated : Mar 30, 2022, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details