పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో సోమవారం ఉదయం జరిగిన బాల్య వివాహం పై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. వివాహానికి ముందే వరుడు, వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా.. గుట్టుచప్పుడు కాకుండా వివాహాన్ని జరిపించారని అధికారులు తెలిపారు. వివరాలు సేకరించి లక్కవరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బాలికకు 18 సంవత్సరాలు నిండే వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని అధికారులు అవగాహన కల్పించారు. బాలికను ఏలూరు శిశు సంక్షేమ సంరక్షణ గృహానికి తరలిస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
చెప్పినా వినకుండా బాల్యవివాహం చేశారు..దీంతో..! - జంగారెడ్డిగూడెంలో బాల్యవివాహం వార్తలు
అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినా వినకుండా బాల్య వివాహం జరిపించారు. దీని పై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని ఆమెను శిశు సంక్షేమ సంరక్షణ గృహానికి తరలించనున్నారు.
child marriage