కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో చికెన్ తింటే వైరస్ ప్రబలుతుందన్న అపోహతో వినియోగదారులు మాంసం ముట్టలేదు. ఫలితంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కోళ్లను పెంచేవాకు బాగా నష్టపోయారు. కిలో కోడి మాంసాన్ని రూ. 30 నుంచి రూ. 40 రూపాయలకు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి.
అయితే... చికెన్ తినడానికి, కరోనాకు సంబంధం లేదని తెలిసి మాంసాహార ప్రియులు మళ్లీ మాంసం దుకాణాల వద్ద క్యూ కట్టారు. అదే సమయానికి చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కోళ్ల రైతులు, హేచరీల యజమానులు నష్టాల భయంతో కోళ్ల పెంపకం తగ్గించడమే ఇందుకు కారణమైంది.