తణుకులో కోళ్లకు వైరస్: మాంసాహార దుకాణాలు బంద్ - తణుకులో చికెన్ దుకాణాలు బంద్
అంతుచిక్కని వైరస్‌తో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూతపడ్డాయి. అధిక సంఖ్యలో కోళ్లు మరణించాయి. వారంరోజులపాటు మాంసాహార దుకాణాలను మూయించేలా చర్యలు తీసుకోవాలని... ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
![తణుకులో కోళ్లకు వైరస్: మాంసాహార దుకాణాలు బంద్ chicken,mutton shops closed at tanuku due to virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6046410-625-6046410-1581502048819.jpg)
వైరస్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాంసాహార దుకాణాలు మూతపడ్డాయి. కోడి, మేక, గొర్రె మాంసం అమ్మే దుకాణాలను మూసేశారు. వైరస్ ప్రభావంతో తణుకు, పరిసర ప్రాంతాల్లో భారీస్థాయిలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. చనిపోయిన కోళ్లను సంబంధిత యజమానులు జాతీయరహదారి పక్కన పడేశారు. ఆరోగ్యరీత్యా తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు చికెన్, మటన్ దుకాణాలను వారం రోజులుపాటు మూసేలా చర్యలు తీసుకోవాలని పురపాలక, మండలాధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో మాంసాహార దుకాణాలు మూతపడ్డాయి. వైరస్ సోకి మరణించిన కోళ్లను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించారు.