పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో చిట్టీల పేరుతో చేసిన భారీ మోసం బయటపడింది. గ్రామానికి చెందిన తిరుమళ్ల రంజిత్ కుమార్ రూ.7కోట్లు ఎగ్గొట్టి పరారయ్యాడని బాధితులు వాపోయారు. రంజిత్ ఎన్నో ఏళ్లుగా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేస్తున్నాడని, నమ్మి చిట్టీలు వేస్తే మోసం చేశాడని కన్నీటిపర్యంతమయ్యారు. అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని, ఇంటికెళ్తే తాళాలు వేసి ఉన్నాయని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్ఐ షేక్ సుభాని అన్నారు.
CHEATING IN WEST GODAVARI : చిట్టీల పేరుతో మోసం...రూ.7కోట్లతో పరారీ..! - west godavari
పశ్చిమగోదావరి జిల్లాలో చిట్టీల మోసం బయటపడింది. నిడదవోలు మండలం అట్లపాడులో గ్రామస్థుల నుంచి డబ్బులు సేకరించి రూ.7కోట్లతో పరారయ్యాడని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిట్టీల పేరుతో మోసం