తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు... రేపు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తణుకులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్నారు. 3 రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి... పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకొని... దెందులూరు మాజీఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శిస్తారు. అక్కడి నుంచి తణుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు భోగుపల్లి బసవయ్య కళ్యాణమంటపంలో జరిగే జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం గోపాలపురం, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. 19న పోలవరం, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలపై సమీక్ష చేస్తారు. 20న పాలకొల్లు, ఉండి, భీమవరం, తణుకు, దెందులూరు, తాడేపల్లిగూడెం నేతలతో సమావేశమవుతారు.