ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

By

Published : Nov 18, 2019, 7:01 AM IST

Updated : Nov 18, 2019, 11:30 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు.

చంద్రబాబు

పశ్చిమగోదావరిలో పార్టీ బలోపేతంమే ప్రధాన అజెండాగా తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి 3రోజుల పాటు ఆ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోపార్టీకి పూర్వవైభవంతో పాటు నేతల మధ్య సమన్వయంపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా దుగ్గిరాల వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్​ని పరామర్శించనున్నారు. అనంతరం తణుకులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ గోపాలపురం, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. రాత్రికి తణుకులోనే చంద్రబాబు బస చేయనున్నారు. వైకాపా నేతల వేధింపులకు గురైన బాధితులతో 19వ తేదీ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. 20వ తేదీన పాలకొల్లు, ఉండి, ఆచంట, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి.

Last Updated : Nov 18, 2019, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details