ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకులాలకు బాల‌యోగి పేరు తొలగింపు అవమానకరం: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

గురుకులాలకు బాల‌యోగి పేరు తొలగింపు అభ్యంతరకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాల‌యోగి పేరును తొల‌గించ‌డం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu
Chandrababu

By

Published : Feb 6, 2022, 6:00 PM IST

Chandrababu: రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలకు ఉన్న బాల‌యోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయికి ఎదిగి, దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాల‌యోగి పేరును తొల‌గించ‌డం అవమానకరమని విమర్శించారు. బాల‌యోగి పేరుతో ఉన్న గురుకులాల అభివృద్దికి మూడేళ్లలో రూపాయి కేటాయించకుండా పేర్లు మార్చి పబ్బం గుడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పథకాలకు అంబేద్కర్ పేరు పెట్టడంలో తెదేపాకు ఎటువంటి అభ్యంత‌రమూ లేదన్న చంద్రబాబు.. జ‌గ‌న్, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాల‌కు ఆ పేరు తొల‌గించి అంబేద్కర్ పేరు పెట్టొచ్చు అని సూచించారు.

అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. నిజంగా జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును తొల‌గించ‌డానికి కారణం.. స్వార్ధ రాజకీయ దురుద్దేశ్యం కాదా..? అని ఆక్షేపించారు. లోక్ స‌భ స్పీక‌ర్ గా ఎదిగి తెలుగు జాతికి పేరు తెచ్చిన బాల‌యోగిని గౌర‌వించుకునే విష‌యంలో కూడా కుసంస్కారంతో ఆలోచ‌న చేయటం మంచిది కాదని హితవు పలికారు.

"గురుకులాలకు బాల‌యోగి పేరు తొలగింపు అభ్యంతరకరం. దళితుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి పేరు తొల‌గించ‌డం సరికాదు. జ‌గ‌న్, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాల‌కు అంబేడ్కర్ పేరు పెట్టొచ్చు. అంబేడ్కర్‌ పేరు పెట్టాలనుకుంటే.. బాలయోగి పేరు తొలగింపు అవసరం లేదు. కొత్త జిల్లాలకు అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టలేదు..?" - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

Sajjala On Teachers demands: 'నిన్ననే చెబితే పరిష్కరించేవాళ్లం.. ఇప్పుడు అలా మాట్లాడటం సరికాదు'

ABOUT THE AUTHOR

...view details