ఆరుగురు యువకులు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను పోగొట్టుకున్న ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఆ కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు - పశ్చిమ గోదావరిలో వాగులో పడి విద్యార్థులు మృతి వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట శివారు వసంతవాడలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పెదవాగులో చనిపోయిన యువకుల ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు.
ఆ కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు