ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడేటి బుజ్జి పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ - బడేటి బుజ్జికి చంద్రబాబు, లోకేశ్ నివాళులు

ఏలూరు మాజీఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్యనేత లోకేశ్ నివాళులు అర్పించారు. బుజ్జి కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతరం బుజ్జి అంతిమయాత్రలో చంద్రబాబు, లోకేశ్ పాల్గొన్నారు. అంతకు ముందు వైకాపా నేతలు, మంత్రి ఆళ్ల నాని నివాళులు అర్పించారు.

Chandrababu, lokesh pays tribute to badeti bujji
బడేటి బుజ్జి పార్థివదేహానికి నివాళర్పించిన చంద్రబాబు, లోకేశ్

By

Published : Dec 26, 2019, 6:28 PM IST

Updated : Dec 26, 2019, 6:35 PM IST

బడేటి బుజ్జి పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీఎమ్యెల్యే, తెదేపా నేత బడేటి కోటారామారావు(బుజ్జి) పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళులు అర్పించారు. బడేటి బుజ్జి కుటుంబసభ్యులను పలకరించి... సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఏలూరులో నిర్వహించిన అంతిమయాత్రలో చంద్రబాబు, లోకేశ్ పాల్గొన్నారు. ప్రజలు, అభిమానాలు, తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

బడేటి కోటారామారావు(బుజ్జి) మరణం పార్టీకి తీరనిలోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరు పట్టణానికి సుదీర్ఘ కాలం ఎమ్యెల్యేగా పనిచేసిన అనుభవం బుజ్జిదని, ఏలూరు అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. స్మార్ట్ సిటీగా ఏలూరును తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బాధ్యతలు చేపట్టి... బలోపేతానికి కృషిచేశారని చంద్రబాబు తెలిపారు. అలాంటి నేత మరణం... వారి కుటుంబానికి, పార్టీకి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.

వైకాపా నేతల నివాళి

మాజీ ఎమ్యెల్యే బడేటి కోటారామారావు(బుజ్జి) మృతిపట్ల ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలూరులో ఉంచిన ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందలూరు ఎమ్యెల్యే అబ్బాయి చౌదరి బుజ్జి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు.

నివాళులు అర్పిస్తున్న వైకాపా నేతలు

సంబంధిత కథనం :

ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత

Last Updated : Dec 26, 2019, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details