ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు

CBN TOUR: జగన్ రెడ్డి అరాచకాలు ఇలానే కొనసాగిస్తే ఈ భూమి మీద ఎక్కడా తిరగలేడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ముంచేసి, మళ్లీ వస్తుందనే నమ్మకం లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఎక్కువ రోజులు రాష్ట్రంలో ఉండలేక పారిపోతాడన్నారు. శ్రీలంకలో ప్రజలపై తలసరి అప్పు లక్షరూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోలక్షా 75వేలు ఉందని చంద్రబాబు దుయ్యబట్టారు.

CBN TOUR
CBN TOUR

By

Published : Jul 22, 2022, 3:40 PM IST

Updated : Jul 22, 2022, 10:39 PM IST

పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి

CBN TOUR: పశ్చిమగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండవరోజు పర్యటన కొనసాగింది. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచలి మండలంలో జోరు వర్షం, బురదను లెక్కచేయకుండా ముందుకు సాగింది. యలమంచలి మండలంలోని దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు.. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కష్టనష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలoటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికికూడా ఈ ముఖ్యమంత్రి రానివ్వట్లేదని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేదని అన్నారు. ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే బాబాయ్ తరహా హత్యలుంటాయని బెదిరిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

పోలవరం పూర్తయివుంటే: పోలవరం పూర్తయితే 120టీఎంసీలు నీరు నిల్వ సామర్ధ్యం వల్ల ఇంత వరద వచ్చి ఉండేది కాదని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయ్​ని చంపి తనపై నేరం నెట్టారని, రఘురామను కూడా చంపి ఇంకెవరిపైనన్నా పెట్టాలని చూస్తారని ఆరోపించారు. ప్రజలు బురదలో ఉంటే సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి రావడం లేదని దుయ్యబట్టారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిముందే దోషులుగా నిలపెడతానని తేల్చిచెప్పారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశమని స్పష్టం చేశారు. ప్రజలకు కష్టం వస్తే బాధ్యత గల ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో ఉండాలన్న చంద్రబాబు... ప్రజల కష్టాలు లెక్క లేదు కాబట్టే ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు. పేదల పొట్టగొడితే తమ పొట్టే పగులుతుంది జాగ్రత్త అని హెచ్చరించారు. జీవనోపాధి కరవై మత్స్యకారులు వలస వెళ్లిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బురదలో బాధితుల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లి.. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులమయ్యామని బాధితులు చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తామే స్వచ్ఛందంగా ఇసుక కట్టలతో ఏటి గట్టును పరిరక్షించుకున్నామని స్థానికులు వివరించారు. ఏటిగట్లను పటిష్టం చేసుకునేందుకు సకాలంలో ప్రజలు స్వచ్ఛందంగా స్పందించకుంటే అంతా గోదావరిలో కలిసిపోయేవాళ్లమని వాపోయారు. ప్రజల చొరవ, ఎమ్మెల్యే తోడ్పాటును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆస్తులూ కొట్టేసేందుకు: అబ్బిరాజుపాలెంలో జోరు వర్షంలో కాలినడకన వెళ్లి బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు. దొంగ ప్రభుత్వం ప్రజల ఆస్తులు కొట్టేసేందుకూ వెనకాడదని ఆరోపించారు. జగన్ రెడ్డి పిడిగుద్దులతో ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ మత్యకారుల జీవనోపాధి ని దెబ్బతీశారని ఆక్షేపించారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి మహిళల్ని ఆర్ధికంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మీటింగుల కోసం జనం కనిపించాలని డ్వాక్రా సంఘాలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. బాదుడే బాదుడుతో నిత్యావసరాలు పెంచి మళ్లీ కట్టెల పొయ్యిలు వాడేలా చేస్తున్నారని మండిపడ్డారు.

రూ.2 వేలు ఇచ్చి: జగన్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. ఎన్నికలు వస్తే.. మంత్రులను పంపిస్తాడు... వరదొస్తే మాత్రం ఎవరూ రారని మండిపడ్డారు. ఎపీలో ఇసుక ధర బంగారంగా మార్చి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరద బాధితులను అసలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణా ప్రభుత్వం పదివేలు ఇస్తే... కొంతమందికి జగన్ రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. హత్యా రాజకీయాలు చేసి... అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెదేపా.. రౌడీల గుండెల్లో నిద్రపోయిన పార్టీ అనేది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణా మంత్రులంతా వరద గ్రామాల్లో పర్యటించి పది వేలు ఇస్తున్నారన్న అయన.. జగన్​ రూ. పది వేలు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ప్రజలు ఈ రౌడీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉండాలన్నారు. అన్యాయాన్ని ఎదిరించండి.. నిలదీయండి.. మీకు తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే.. రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద ప్రాంతాల ప్రజలకు శాశ్వత ఇళ్లు కట్టించే బాధ్యత తెదేపా తీసుకుంటుందని వెల్లడించారు.

లక్ష్మీపాలెంలో ఇంటింటికి వెళ్లి వరద బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు. బురదమయమైన ఇళ్లలోకి జారుతూనే వెళ్లి.. లోపలి పరిస్థితిని పరిశీలించారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని వారికీ ధైర్యం చెప్పారు. రెండు రోజుల క్రితం వరకూ వరద నీటిలోనే తాము ఉండాల్సి వచ్చిందని బాధితులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందంటూ గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. బురద నీళ్లలోనే చంద్రబాబు కాళ్ళు కడుక్కున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 22, 2022, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details