POLICE SECURITY AT POLAVARAM : తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలవరం పర్యటన దృష్ట్యా ప్రాజెక్టు సైట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఉద్యోగులు, స్థానికులను దారి మళ్లిస్తున్నారు. మరికాసేపట్లో పోలవరం గ్రామంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు.
చంద్రబాబు పోలవరం పర్యటన.. పోలీసుల భారీ మోహరింపు - idem karma program
CBN POLAVARAM TOUR : టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మరికాసేపట్లో పోలవరం గ్రామంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఎవ్వరినీ అనుమతించడం లేదు.
CBN POLAVARAM TOUR
నరసన్నపాలెం నుంచి బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం, రేపల్లెవాడ, దిప్పకాయలపాడు, తంగెళ్లపాడు, కందిరీగగూడం, కన్నాపురం మీదుగా చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కేఆర్ పురం, కొవ్వాడ, ఎల్ఎన్డీ పేట, దొండపాడు, పట్టిసీమ, తాళ్లపూడి, వేగేశ్వరపురం, అరికిరేవుల మీదుగా కొవ్వూరు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
ఇవీ చదవండి: