సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని వైకాపా పాలన వల్ల ఏలూరులో 150 మందికి పైగా పిల్లలు, పెద్దలు తీవ్ర అస్వస్థతతో విలవిల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం, వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గమైన ఏలూరులో తాగునీరు కలుషితం అయిందంటే పాలకులది ఎంత బాధ్యతారాహిత్యమో అర్థం అవుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం కనిపిస్తోందని మండిపడ్డారు. 18 నెలల పాలనలో కనీసం రక్షిత మంచినీటి ట్యాంకులూ శుభ్రం చేయించని నిర్లక్ష్య ఫలితమే ఈ విషాదమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.