ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ మెప్పు కోసం పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు'

తప్పుడు కేసులతో తెదేపా కార్యకర్తలను, నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు

తణుకులో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష

By

Published : Nov 19, 2019, 3:25 PM IST

తణుకులో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష

తెలుగుదేశం సమావేశాలకు కార్యకర్తలు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు 30యాక్టు పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులను బెదిరించి పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. చింతమనేని ప్రభాకర్‌పై 13 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని... ఈ కేసులపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details