మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రవీంద్ర మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి బాబును ఫోన్లో పరామర్శించారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోవడం బాధాకరమన్నారు.
మాగంటి బాబు కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా మనో ధైర్యం ఇవ్వాలని.. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.