ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెందులూరులో పర్యటించిన కేంద్ర బృందం - Central team tour on Eluru incident news

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో కేంద్ర శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఏలూరు పట్టణానికి సాగు, తాగు నీరందించే చెరువును పరిశీలించారు.

Central team
ఎరువుల దుకాణంలో రసాయనాల వివరాలు సేకరిస్తున్న కేంద్ర బృందం

By

Published : Dec 11, 2020, 6:15 PM IST

కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు దెందులూరు మండలంలో పర్యటించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడి పొలాల్లో ఉపయోగించే పురుగుల మందుల గురించి తెలుసుకున్నారు. ఏలూరులో పంటలకు వాడే రసాయన ఎరువులను పరిశీలించారు. ఖరీఫ్​ సీజన్​లో వాడిన క్రిమిసంహారకాల గురించి స్థానిక మందుల దుకాణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి అందించే తాగునీటి వనరులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details