ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ - పోలవరం ప్రాజెక్టు తాజా సమాచారం

పోలవరం ప్రోజెక్ట్​ పురోగతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ సందర్శించింది. జలవనరుల శాఖ అధికారులు వీరికి స్వాగతం పలికారు.

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ
పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

By

Published : Dec 29, 2019, 9:28 PM IST

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల కమిటీ సందర్శించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ప్రాజెక్ట్ క్యాంప్ కార్యాలయం వద్ద కమిటీ సభ్యులకు జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. గోదావరి వరదల కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడటం వల్ల పనులు జాప్యం అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. నిపుణుల కమిటీ ఛైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా... ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించారు. రేపు విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details