గోదావరి-కృష్ణా...కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ... జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసిందని, ఈ నదుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 5 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు లభిస్తుందని మంత్రి షెకావత్ తెలిపారు. ఎంపీలు టీజీ వెంకటేష్ , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీకి తొలివిడతగా రూ.151 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధం - గోదావరి కృష్ణా నదుల అనుసంధాన వార్తలు
గోదావరి- కృష్ణా, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. నదుల అనుసంధానికి ఏపీ రాసిన లేఖ అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీకి రూ. 151 కోట్లు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధం