ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టుపై కొత్త లెక్కలు కోరిన కేంద్రం - polavaram new dpr

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త లెక్కలు పంపాలని రాష్ట్ర జలవనరులశాఖను కేంద్రం కోరింది. రాష్ట్ర విభజన నాటికి ప్రాజెక్టులో ఎంత పని మిగిలి ఉందో... నాటి ధరలతో ఎంత ఖర్చవుతుందో లెక్కలు పంపాలని సూచించింది. దాదాపు ఏడాది తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదలయ్యాయి. రూ.1850 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

పోలవరం ప్రాజెక్టుపై కొత్త లెక్కలు కోరిన కేంద్రం

By

Published : Nov 9, 2019, 7:07 AM IST

పోలవరం ప్రాజెక్టుపై కొత్త లెక్కలు కోరిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టుపై కొత్త లెక్కలు పంపాలని కేంద్రం కోరింది. ఫలితంగా డీపీఆర్-2 ఆమోదానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు అధికారులు వివిధ సమీకరణాల్లో కేంద్రానికి లెక్కలు సమర్పించగా... వాటిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. గతంలో 600 కిలోల బరువున్న సమాధాన పత్రాలను దిల్లీకి సమర్పించిన అధికారులు... దాదాపు నెలపాటు కేంద్ర జల్‌శక్తి అధికారుల ప్రశ్నలన్నింటికీ బదులిచ్చారు. ఇప్పుడు మళ్లీ కొత్త లెక్కలు తయారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర అధికారులపై పడింది.

డీపీఆర్-2 ఆమోదానికి దాదాపుగా రెండేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రూ.55వేల 548 కోట్ల అంచనాతో దీనికి కేంద్ర జల్‌శక్తికి చెందిన సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత... మళ్లీ కొత్త కసరత్తు మొదలైంది. కేంద్ర ఆర్థికశాఖలోని ఆర్​ఈసీ కమిటీ ముందుకు ఈ అంశం వెళ్లింది. పునరావాసం, భూసేకరణ వంటి అనేక అంశాలపై వారు సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు బదులిచ్చారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజన నాటికి... అయ్యే మొత్తం ఖర్చును మొత్తం భరిస్తామని కేంద్రం తెలిపింది. 4 నమూనాల ద్వారా కేంద్రం కోరిన లెక్కలన్నింటినీ రాష్ట్ర అధికారులు సమర్పించారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5వేల 600 కోట్లలో... రూ.1850 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదలవుతాయని భావించింది. అయితే మిగతా నిధులు రెండో విడతలో రానున్నట్టు పోలవరం అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ... ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు

ABOUT THE AUTHOR

...view details