ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2020, 1:14 PM IST

ETV Bharat / state

మైకం వచ్చినట్టు నటించి.. మాయ చేసి దోచేస్తున్నారు!

బైక్‌పై వెళ్తూ పడిపోయినట్లు నటించి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు దుండగులు. సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. భీమవరం ఒకటి, రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇలా.. ఒకే తరహా దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Cell phone theft
Cell phone theft

బైక్‌పై వెళ్తూ పడిపోయినట్లు నటించి సెల్ ఫోన్లు చోరీ

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దొంగలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. సహాయం కోరినట్లు నటించి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. గునుపూడికి చెందిన బంగార్రాజు.. ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని రైతు బజార్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఒక యువకుడు బైక్ పై వచ్చి.. స్టాండ్ వేస్తూ పడిపోతున్నట్లు నటించాడు. అటుగా వెళ్తున్న బంగార్రాజు ఆ యువకుణ్ని.. పైకి లేపి ప్రయత్నం చేస్తుండగా.. వెంటనే మరో యువకుడు అక్కడికి వచ్చాడు.

అతనికి సాయం చేస్తున్నట్లు.. ఒక పేపర్‌ అడ్డుపెట్టి బంగార్రాజు పై జేబులో ఉన్న సెల్ ఫోన్‌ దొంగిలించాడు. మరుక్షణమే... ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ.. అక్కడ ఎదురుగా భవనంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. వాటిని తీసుకుని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో ఆ ఇద్దరు దొంగలే.. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details