ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతరం నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలి: లక్ష్మీ నారాయణ - పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని బ్రిగ్రేడ్ పాఠశాల వార్షికోత్సవంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి ఆరోగ్య, పర్యటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావులు పాల్గొన్నారు. కష్ట నష్టాను భరిచేవాడే నాయకుడు అవుతాడని మల్లాడి కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

CBI JD Laxminarayan
బ్రిగ్రేడ్ పాఠశాల వార్షికోత్సవంలో సీబీఐ మాజీ జేడీ.లక్ష్మీనారాయణ

By

Published : Feb 6, 2020, 1:14 PM IST

బ్రిగ్రేడ్ పాఠశాల వార్షికోత్సవంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఈ నెల 27, 28 తేదీల్లో వ్యవసాయం గ్రామీణాభివృద్ధి అంశాలపై ఇన్నోవేషన్ డేను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని బ్రిగ్రేడ్ పాఠశాల వార్షికోత్సవంలో పుదుచ్చేరి ఆరోగ్య, పర్యటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుతో కలసి పాల్గొన్నారు. యువతరం నూతన ఆవిష్కరణల వైపు సాగాలన్నారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై యానాం మంత్రి మల్లాడి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిస్తేనే రాజకీయాల్లో ఉంటాను, ఓడిపోతే వెళ్ళిపోతాను అనడం సరి కాదని, కష్ట నష్టాలను భరించేవాడు నాయకుడు అవుతాడన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details