బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకటరమణ, తోట సురేంద్రపై అభియోగాలు దాఖలయ్యాయి. ఐడీబీఐ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య లు తీసుకుంది. తప్పుడు పత్రాలతో 51 కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్పై సీబీఐ కేసు - west godavari district latest news
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది.

CBI CASE filed on SRI KRISHNA AGRI PROCESS in kovvuru