ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2020, 6:12 PM IST

ETV Bharat / state

పిడుగు పాటుకు పశువుల పాక దగ్ధం

పశువుల పాకపై పిడుగు పడి పూర్తిగా దగ్ధమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. పిడుగు సరాసరి పశువుల పాకపైనే పడటం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించి పాక పూర్తిగా కాలిపోయింది.

పిడుగు పాటుకు పశువుల పాక పూర్తిగా దగ్ధం.. ఆస్తి నష్టం
పిడుగు పాటుకు పశువుల పాక పూర్తిగా దగ్ధం.. ఆస్తి నష్టం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం గ్రామ శివారులో పిడుగులు పడ్డాయి. ఓ పశువుల పాక దగ్ధమైంది.

సరాసరి పశువుల పాకపైనే..

పిడుగు సరాసరి పశువుల శాలపైనే పడటం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించి పాక పూర్తిగా కాలిపోయింది. పిడుగు పడిన సమయంలో పశుపాకలో పశువులు, రైతులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా అగ్గి ఎగిసిపడటం వల్ల మంటలు ఆర్పేందుకు రైతులు ప్రయత్నించినప్పటికీ.. పశువుల శాల పూర్తిగా కాలిపోయింది.

ఇవీ చూడండి : 'సీమ పౌరుషం ఉంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'

ABOUT THE AUTHOR

...view details