ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళిత యువకులపై దాడి చేసిన వారిని శిక్షించాలి' - west godavari latest news

తమ యువకులను స్తంభానికి కట్టేసి కొట్టిన వారిని శిక్షించాలంటూ దళిత సంఘాల నేతలు తూర్పు గోదావరి జిల్లాలో రహదారిపై ధర్నా చేశారు. శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

caste discrimination committee dharna
కుల వివక్ష పోరాట సమితి ధర్నా

By

Published : Jan 3, 2021, 9:22 AM IST

దళిత యువకులను స్తంభానికి కట్టేసి కొట్టిన వారిని శిక్షించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం అంకంపాలెంలో కుల వివక్ష పోరాట సమితి నేతలు, దళిత సంఘాల నేతలు.. రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అగ్రకులానికి చెందిన 15 మంది అంకంపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు దళిత యువకులను స్తంభానికి కట్టేసి కొట్టారని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు రవి కుమార్ అన్నారు.

దళితులు నేటికీ కుల వివక్షకు గురవుతున్నారని వాపోయారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ దుర్గారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details