బాలికను ప్రేమ పేరుతో వేధించి గర్భవతిని చేశాడు.. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను కులం పేరుతో ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై ద్వారకాతిరుమల పోలీసులు అత్యాచారం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెంటపడి పెళ్లి చేసుకున్నాడు..కులం పేరుతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు - పశ్చిమగోదావరి జిల్లాలో బాలిక వార్తలు
బాలికను ప్రేమ పేరుతో వేధించి..గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుని ఇప్పుడు కులం పేరుతో వేధిస్తున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో జరిగింది.

ద్వారకాతిరుమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మాగంటి నాగరాజు సుమారు ఏడాది క్రితం తొలుత ప్రేమిస్తానని..పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకున్నాడు. ఏడో నెల గర్భిణిగా ఉన్నప్పుడు నాగరాజు, తన తండ్రి పెద్దిరాజు బాలికను కులం పేరుతో దూషించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. బాధితురాలు ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అత్యాచారం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.