పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తృటిలో ప్రమాదం తప్పింది. భీమడోలు నుంచి ఏలూరు వస్తున్న కారులో.. ఏలూరు పాత బస్టాండ్ గూడ్స్ షెడ్ రోడ్డు వద్దకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమై బయటకు దూకేయటంతో బాధితులకు స్వల్ప గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కారులోని మంటలను అదుపు చేశారు. కారులోని ఇంజన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు.
షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం... ప్రయాణికులు సురక్షితం - elur car fired
ఓ ముగ్గురు కారులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా కారులో మంటలో చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన వారు కారులో నుంచి దుకేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం