ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CAR ACCIDENT: జాతీయ రహదారిపై కారు ప్రమాదం.. 9 మందికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కొవ్వూరు-గుండుగొలను జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

జాతీయ రహదారిపై కారు ప్రమాదం...9 మందికి గాయాలు
జాతీయ రహదారిపై కారు ప్రమాదం...9 మందికి గాయాలు

By

Published : Dec 28, 2021, 10:02 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కొవ్వూరు-గుండుగొలను జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. విశాఖ జిల్లా చోడవరం ప్రాంతానికి చెందిన మిడ్ డే మిల్స్​కు చెందిన తొమ్మిది మంది ఉద్యోగులు కలిసి కారులో.. విజయవాడలో జరిగే సమావేశానికి బయలుదేరారు.

వీరు పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లి సమీపానికి వచ్చేసరికి కారు అదుపుతప్పి.. రహదారి పక్కకు రక్షణ గోడ మధ్యలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Migratory Birds Dead: పెలికాన్ పక్షులకు ఏమైంది..! మృత్యువాతకు కారణం ఏంటి?

ABOUT THE AUTHOR

...view details