దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఏలూరు గ్రామీణ మండలం మల్కాపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ రైతులపై నిర్బంధ చర్యలు ప్రయోగించటం దుర్మార్గమన్నారు. రైతుల పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని రైతులను కోరారు.
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా కొవ్వొత్తులతో ప్రదర్శన - Farmers' concern in Eluru, West Godavari district
దిల్లీలో పోరాడుతున్న రైతులపై మోదీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని ఏలూరు గ్రామీణ మండలం మల్కాపురంలో రైతులు అన్నారు. అక్కడి రైతులకు మద్దతుగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా కొవ్వుత్తుల ప్రదర్శన
Last Updated : Dec 1, 2020, 10:47 PM IST
TAGGED:
ఏలూరులో రైతుల ఆందోళన వార్తలు