ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలకు ఎనలేని సేవలందిస్తోన్న తానా : ఆరిమిల్లి రాధాకృష్ణ - ap latest news

Cancer Medical Camp by Tana Foundation : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో క్యాన్సర్ నిర్ధారిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ప్రజలకు ఎనలేని సేవలందిస్తోందని పేర్కొన్నారు.

క్యాన్సర్ నిర్ధారిత వైద్య శిబిరం
Cancer Medical Camp

By

Published : Dec 10, 2022, 6:12 PM IST

Cancer Medical Camp by Tana Foundation: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో క్యాన్సర్ నిర్ధారిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిపుణులైన వైద్య బృందం శిబిరంలో రోగులకు నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు.

మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ప్రజలకు ఎనలేని సేవలందిస్తోందని పేర్కొన్నారు. విద్య వైద్య రంగాలతో పాటు రైతులకు తమ వంతు సాయం అందిస్తున్నారని, రోగులకు అవసరమైన ఇతర సదుపాయాలను కల్పించడానికి ఫౌండేషన్ సహకరిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. శిబిరం వద్ద రైతులకు స్పేయర్లు, భూ నాణ్యత ప్రమాణాల పరీక్షించే కిట్లు అందజేశారు. తానా ఫౌండేషన్ అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు ప్రజలకు మాత్రమే కాక తెలుగు రాష్ట్రాల్లో సైతం వివిధ రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details