ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

17 మంది కౌన్సిలర్లతో.. అజ్ఞాతంలోకి వైకాపా ప్రజాప్రతినిధి?

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్​ ఎంపికపై వైకాపాలో క్యాంపు రాజకీయాలు మెుదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధుల మధ్య ఛైర్మన్ ఎంపికలో విభేదాలు తలెత్తాయి.

ప్రముఖ ప్రజాప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు.. వైకాపాలో క్యాంపు రాజకీయాలు
ప్రముఖ ప్రజాప్రముఖ ప్రజాప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు.. వైకాపాలో క్యాంపు రాజకీయాలుప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు.. వైకాపాలో క్యాంపు రాజకీయాలు

By

Published : Mar 15, 2021, 10:16 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపాలో.. గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్​ ఎంపికపై.. పార్టీలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి.

ప్రముఖ ప్రజాప్రతినిధి.. 17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఛైర్మన్ ఎంపికలో ఓ కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నట్లు సమాచారం. 25 వార్డుల్లో గెలిచిన వైకాపాకు.. ఆధిక్యం ఉన్నా ఇద్దరు ప్రజాప్రతినిధుల విభేదాలతో క్యాంపు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details