ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కెమెరాల అద్దె పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - పశ్చిమ గోదావరి నేర వార్తలు

విలువైన కెమెరాలు అద్దె కోసమని తీసుకుని ఇవ్వకుండా మోసగిస్తున్న అంతరాష్ట్ర మోసగాడిని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన 17 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.

camera thief
తణుకులో కెమెరాల దొంగ అరెస్ట్, తణుకు కెమెరాల మోసగాడు అరెస్ట్

By

Published : Mar 26, 2021, 11:19 AM IST

కెమెరాలు అద్దెకు తీసుకుని.. తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, రూ.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్​స్టేషన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన కుడిపూడి శివకుమార్‌ తణుకు హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న పైడిముక్కల జితేంద్ర వీరవెంకట నాయుడుకు కెనాన్‌ 5 డీ కెమెరాను అద్దెకు ఇచ్చారు. దాన్ని తిరిగి ఇవ్వకుండా తనతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొందరిని మోసం చేస్తున్నారని.. ఈ నెల 14న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐలు కె.రామారావు, డి.రవికుమార్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గురువారం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వద్ద అరెస్టు చేసి అతని వద్ద రూ.20 లక్షల విలువైన 17 కెమెరాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ శ్రీనాథ్‌, తణుకు సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ అభినందించారు.

ఇదీ చదవండి:నాటు సారా తాగి ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details