ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖ జిల్లాల్లో మోసాలు చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. కెమెరాలు అద్దెకు తీసుకొని ఉడాయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి కెమెరా యజమానులకు వాటిని చూపి మోసాలకు పాల్పడుతున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేసి... వారి నుంచి రేంజ్ కెమెరాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ వివరాలు వెల్లడించారు.
కెమెరా దొంగల ముఠా గుట్టురట్టు... నలుగురు అరెస్టు - latest crime news
ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖలో... కెమెరాలు అద్దెకు తీసుకొని ఉడాయిసున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఓ కారు, ప్రింటర్, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
![కెమెరా దొంగల ముఠా గుట్టురట్టు... నలుగురు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4850215-165-4850215-1571881403496.jpg)
కెమెరా దొంగల ముఠా అరెస్టు....