పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బాదంపూడి వై-జంక్షన్ వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణకులు ఉన్నారు. 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడేనికి చెందిన అంబులెన్సు వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అదే సమయంలో వర్షం కురవడంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Bus Accident: బాదంపూడి వై-జంక్షన్ వద్ద బస్సు బోల్తా.. బస్సులో 40 మంది ప్రయాణికులు - ఏపీ తాజా వార్తలు
బాదంపూడి వై-జంక్షన్ వద్ద బస్సు బోల్తా పడింది. మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడి 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
bus accident
Last Updated : Sep 27, 2021, 8:23 AM IST