పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న అరటి తోటలోకి దూసుకుపోయింది. తణుకు డిపోకు చెందిన బస్సు, రాజమహేంద్రవరం వెళ్తుండగా మోర్త - దమ్మెన్ను గ్రామాల మధ్య ప్రమాదానికి గురయ్యింది. ఆ సమయంలో బస్సులో సిబ్బందితోపాటు, ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలతో రహదారి గుంతలమయం కావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వివరించారు. అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
గుంతలమయంగా రోడ్డు.. ఆరటి తోటలోకి దూసుకెళ్లిన బస్సు - బస్సు ప్రమాదాలు
భారీ వర్షాలకు రహదారిపై పడిన గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ గుంతల కారణంగా ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న అరటి తోటలోకి దూసుకుపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
బస్సుకు తప్పిన ప్రమాదం