పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఇసుక కొరతతో నాలుగు నెలలుగా పని లేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇతరులకు ఇస్తున్నట్లే తమకు పదివేల రూపాయలు కరవు భత్యం ఇవ్వాలన్నారు.ఇసుక ధరలు అత్యధికంగా ఉండటంతో నిర్మాణాలు సాగడం లేదని,ఇసుకను తక్కువ ధరకే ఇస్తే..సమస్యకు పరిష్కారం అవుతుందని వారు తెలిపారు.నిర్మాణ కార్మికులకు కరవు భత్యంతో పాటు నెలకు ఐదువేల రూపాయల పింఛన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
"ఇసుక ధరలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నాయ్.." - building workers darna
ప.గో. జిల్లా తణుకులో భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. ఇసుక ధరలు తమ ప్రాణం మీదకు వచ్చాయని మండిపడ్డారు. ఇసుక ధరలు తగ్గితే,తమకు ఉపాధి లభిస్తుందని..ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తణుకులో భవన నిర్మాణ కార్మికుల ధర్నా