కవల పిల్లలు, కవల దూడలు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో గేదెకు రెండు కవల దూడలు జన్మించాయి. రెండు దూడలూ ఆడ దూడలే కావటం విశేషం. తేతలి గ్రామానికి చెందిన కోట వెంకటేష్ వడ్లూరులో డైరీ ఫారం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. గేదెకు కవల దూడలు పుట్టడమే అరుదు అనుకుంటే, అవి రెండూ ఆడ దూడలే కావటం చాలా సంతోషంగా ఉందని వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు వెంకటేష్ తెలిపారు.
డబుల్ ధమాకా... ఒకే కాన్పులో రెండు దూడలు - buffalo gives birth to twins
ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చిందో గేదె. కవల దూడలు పుట్టడమే అరుదు అనుకుంటుంచే ఆ రెండు దూడలూ ఆడ దూడలే కావటంతో వాటి యజమాని మరింత సంబరపడుతున్నాడు.
ఒకే కాన్పులో రెండు దూడలు