పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ, మెట్ట మండలాల్లో కురిసిన భారీ వర్షానికి స్థానిక వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద పడమటి వాగు పొంగి రహదారిపై ప్రవహించింది. సుమారు గంట వరకు వాహన రాకపోకలు నిలిచాయి. బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.
మన్యంలో భారీ వర్షం.. పొంగిన వాగులు, వంకలు... - మన్యంలో భారీ వర్షానికి పొంగిన వాగులు, వంకలు
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ, మెట్ట మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి.
మన్యంలో భారీ వర్షానికి పొంగిన వాగులు, వంకలు