ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు బాలురు అదృశ్యం .. పోలీసుల ముమ్మర గాలింపు - దెందులూరు వార్తలు

సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

boys missing
ఇద్దరు బాలుర అదృశ్యం .. పోలీసుల ముమ్మర గాలింపు

By

Published : Jan 10, 2021, 11:22 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. శనివారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన యశ్వంత్​, అభి అనే బాలురు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యశ్వంత్ ఆరవ తరగతి చదువుతుండగా , అభి ఐదో తరగతి చదువుతున్నాడు. వారి తండ్రి సురేష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలుర అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details