పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన ఏడేళ్ల మోక్ష గౌతమ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఉండ్రాజ వరపు గంగాధరరావు, సారమ్మ దంపతుల కుమారుడు మోక్ష గౌతమ్ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు గ్రామం మొత్తం వెతికారు. అయినా బాలుడి ఆచూకీ తెలియలేదు. ఆందోళనతో వీరవాసరం పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి వెతికిన పోలీసులు, గ్రామస్థులు, బంధువులు... బాలుడు శవాన్ని గుర్తించారు. ఊరి చివరి చెరువులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు పంపించారు. ఆ బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం అక్కడి ఉన్న ఎవరి తరం కాలేదు.
ఆడుకుంటూ...అదృశ్యమయ్యాడు... శవమై దొరికాడు - boy missing case
పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడ బాలుడి అదృశం కేసు దుఃఖాంతమైంది. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన మోక్ష గౌతమ్ ఇవాళ ఊరి చివరి చెరువులో శవమై దొరికాడు.
వీరవాసరంలో ఏడేళ్ల బాలుడు అదృశ్యం
Last Updated : Jun 15, 2019, 11:31 AM IST