పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన కార్యాలయంలో సిబ్బందిని ఖాళీ చేయించారు. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఏలూరు నుంచి బాంబ్ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.
నిడదవోలు తహసీల్దార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ - bomb at nidadhavole
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు తనిఖీ చేయగా.. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.

Bomb threat call to Nidadavolu MRO office
సిబ్బందిని కార్యాలయానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఆగంతకుడి వివరాలు సేకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: కీలకంగా మారనున్న యువతుల ఓట్లు