పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన వై లక్ష్మి, ఆమె కుమారుడు మూర్తి గతంలో చిట్టీల పేరుతో కొంతమంది వద్ద నుంచి సుమారు రూ.5 కోట్ల మేర వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో ఆ సొమ్ము తిరిగి కట్టేస్తామనీ ఒప్పుకున్నారు.
అంతే.. తర్వాత నుంచి తల్లీకొడుకు కనిపించకుండా పోయారు. ఇటీవల మూర్తి స్థానికులకు కనిపించగా... స్థానిక గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లిన స్థానికులు ఆతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి స్థానికులుకు నచ్చచెప్పి అతన్ని విడిపించారు.