పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - ఉండి రోడ్డులోని అనాకోడేరు కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనాకోడేరు కాలువ సమీపంలో ఓ ఖాళీ స్థలంలో ఉంది. సమీపంలో వెల్డింగ్, మెకానిక్ దుకాణాలు ఉన్నాయి.
ఒక్కసారిగా సంభవించిన పేలుడుకు అక్కడే గడ్డి మేస్తున్న ఆవు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి వుంది.
సీఎం పర్యటన నేపథ్యంలో అలర్ట్..