పోలవరం నిర్వాసితుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) డిమాండ్ చేశారు. వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను(funds) కేంద్రం సర్దుబాటు చేస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ(vizag steel plant)ను మరింత అభివృద్ధి చేస్తామన్న సోము వీర్రాజు.. స్టీల్ ప్లాంట్ లో అందరికీ ఉద్యోగాలు ఉంటాయని, ప్లాంట్ ఉత్పత్తిని ఇంకా పెంచుతామని తెలిపారు.
SOMU VEERRAJU: 'పోలవరం నిర్వాసితుల ఇబ్బందులను పట్టించుకోండి'
పోలవరం ప్రాజెక్టు(polavaram project) నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల (Expatriates)ఇబ్బందులను పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP leader somu veerraju) అన్నారు. రాష్ట్రం ఇస్తున్న నిధులను కేంద్రం సర్దుబాటు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ(vizag steel plant) విక్రయం జరగనివ్వమని స్పష్టం చేశారు.
భాజపా నేత సోము వీర్రాజు
Last Updated : Jul 14, 2021, 7:26 PM IST