ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SOMU VEERRAJU: 'ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయండి' - పోలవరంలో సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్‌పై (polavaram project) ఉన్న ఆసక్తి... నిర్వాసితులపై లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP state president somu veerraju) విమర్శించారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ (CM jagan) ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

భాజపా నేత సోమువీర్రాజు
భాజపా నేత సోమువీర్రాజు

By

Published : Jul 12, 2021, 8:01 PM IST

భాజపా నేత సోమువీర్రాజు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ చూపిస్తున్న ఆసక్తి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజక్టును సందర్శించిన ఆయన... నిర్వాసితుల గ్రామమైన ఎల్ఎన్డీపేటలో పర్యటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్వాసితులకు పలు హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం, ప్యాకేజీ, మౌళిక వసతుల కల్పన వంటి సమస్యలు తక్షణం పరిష్కరించాలని అన్నారు. ఈనెల 14న పోలవరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి సత్వరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details