తిరుమల స్వామివారి ఆస్తుల అమ్మకాలకు తితిదే తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులు ఇచ్చిన భూములు అమ్మే హక్కు ఎవరిచ్చారని ఆయన పాలకమండలిని ప్రశ్నించారు.